Sunil Gavaskar: ఇమ్రాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లే విషయంలో ప్రభుత్వ సలహా తీసుకుంటా!: సునీల్ గవాస్కర్

  • ప్రభుత్వంతో చర్చించి తుది నిర్ణయం
  • 15కు వాయిదా పడితే మాత్రం వెళ్లబోను
  • స్పష్టం చేసిన సునీల్ గవాస్కర్

పాకిస్థాన్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను హాజరయ్యే విషయంలో భారత ప్రభుత్వం సలహా తీసుకుంటానని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వంతో చర్చించిన తరువాతే తుది నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా తనకు ఆహ్వానం అందిందని, తనకూ వెళ్లాలనే ఉందని ఆయన అన్నారు.

తొలుత 11వ తేదీన ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పి, ఆపై 14కు దాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే, మరేవైనా కారణాల వల్ల ఆయన ప్రమాణ స్వీకారం ఆగస్టు 15కు వాయిదా పడితే మాత్రం తాను హాజరు కాలేనని గవాస్కర్ తెలిపారు. 15న తన తల్లి 93వ పుట్టిన రోజుతో పాటు భారత స్వాతంత్ర్య దినోత్సవం ఉందని గుర్తు చేసిన ఆయన, తాను టెస్టు మ్యాచ్ లలో కామెంట్రీ చేసేందుకు లండన్ వెళ్లాల్సి వుందని కూడా ఆయన అన్నారు.

Sunil Gavaskar
Imran Khan
India
Pakistan
  • Loading...

More Telugu News