YSRCP: వైసీపీకి రాజీనామా చేశాను... జనసేనలో చేరబోతున్నానన్న కాకినాడ నేత శిట్టిబత్తుల రాజబాబు!

  • ఎస్సీలకు ప్రాతినిధ్యం దక్కడం లేదు
  • విషయం జగన్ కు చెప్పినా ఫలితం లేకపోయింది
  • అగ్రవర్ణ నేతలు వివక్ష చూపుతున్నారన్న రాజబాబు

తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శిట్టిబత్తుల రాజబాబు, పార్టీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. తన రాజీనామాను వైఎస్ జగన్ కు మెయిల్ ద్వారా పంపించినట్టు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.

పార్టీకి పునాదిగా ఉన్న ఎస్సీలకు తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ఈ విషయంలో తాను పలుమార్లు రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేసినా, ఫలితం లేకపోయిందని అన్నారు. అగ్రవర్ణ నేతలు తనపై వివక్ష చూపుతుండటంతోనే రాజీనామా చేసినట్టు తెలిపారు. తన మనస్తాపాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లానని, ఆయన కూడా పట్టించుకోలేదని ఆరోపించిన రాజబాబు, వైసీపీలో తాను ఇమడలేకపోయానని అన్నారు. త్వరలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలసి ఆ పార్టీలో చేరుతానని తెలిపారు. 

YSRCP
East Godavari District
Rajababu
Jagan
Resign
  • Loading...

More Telugu News