Chandrababu: మనకు మిగిలింది వారం రోజులే.. ఇంకా పోరాడండి!: ఎంపీలతో చంద్రబాబు

  • పోరాటానికి మరో వారం రోజుల సమయం
  • మరింత గట్టిగా వాదన వినిపించండి
  • ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు చివరి వారానికి ప్రవేశించాయని, విభజన తరువాత రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పోరాటం చేయడానికి వారం రోజుల సమయం మాత్రమే ఉన్నందున, పార్లమెంట్ లో మరింత గట్టిగా వాదన వినిపించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎంపీలకు సూచించారు.

ఈ ఉదయం పార్లమెంట్ సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ఈ వారం రోజుల పోరాటం టీడీపీకి ఎంతో కీలకమని తెలిపారు. ఎంపీలంతా మరింత ముమ్మరంగా పోరాటం చేయాల్సిన సమయం ఇదని, ఏ మాత్రం అలక్ష్యం చేయవద్దని ఆయన సలహా ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకునేందుకు గతంలో చూపిన స్ఫూర్తినే చూపాలని, రైల్వే జోన్, ప్రత్యేక హోదాలను సాధించేంత వరకూ విశ్రమించేది లేదని ప్రతిన బూనాలని పిలుపునిచ్చారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేయాలని చంద్రబాబు ఆదేశించారు.

Chandrababu
parliament
Telugudesam
Special Category Status
MPs
  • Loading...

More Telugu News