Srinivasa Kalyanam: దిల్ రాజు బంపరాఫర్... శ్రావణమాసంలో పెళ్లి చేసుకునే జంటలకు పట్టు వస్త్రాలు!

  • 9న విడుదల కానున్న 'శ్రీనివాస కళ్యాణం'
  • వెంకటేశ్వరుని వద్ద పూజలు చేసి వస్త్రాలు పంపుతాం
  • ఎంపిక చేసిన జంటలకు స్వయంగా వచ్చి ఇస్తాం
  • వెడ్డింగ్ కార్డు పంపితే చాలన్న దిల్ రాజు

తాను నిర్మించిన 'శ్రీనివాస కళ్యాణం' విడుదల సందర్భంగా నిర్మాత దిల్ రాజు బంపరాఫర్ ఇచ్చారు. ఈనెల 9న చిత్రం విడుదల కానుండగా, కళామందిర్ కల్యాణ్ నుంచి వచ్చిన ఆలోచన మేరకు ఓ ఆఫర్ ను సిద్ధం చేశామని చెప్పిన ఆయన, ఈ శ్రావణ మాసంలో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి చేసుకోబోతున్న జంటలకు తమ టీమ్ పట్టు వస్త్రాలను బహుమతిగా ఇవ్వనుందని చెప్పారు. శ్రీ వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు అందేలా దేవాలయంలో పూజలు జరిపించి వీటిని అందిస్తామని ఆయన అన్నారు.

శ్రావణ మాసంలో పెళ్లిళ్లు జరగబోతున్న జంటలు, తమ వెడ్డింగ్ కార్డును పంపితే సరిపోతుందని, వారికి పట్టు వస్త్రాలను పంపుతామని, కొంతమంది ఎంపిక చేసిన జంటలకు తమ 'శ్రీనివాస కళ్యాణం' టీమ్ స్వయంగా వచ్చి దుస్తులను అందిస్తుందని చెప్పారు. ఏ అడ్రస్ కు వెడ్డింగ్ కార్డును పంపాలన్న విషయాన్ని ఫేస్ బుక్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తామని చెప్పారు. పెళ్లికి ఉండే విలువను గురించి తెలియజెప్పే చిరు ప్రయత్నమే ఇదని దిల్ రాజు వ్యాఖ్యానించారు.

Srinivasa Kalyanam
Dil Raju
Telangana
Andhra Pradesh
Sravana masam
Marriage
Cloths
  • Loading...

More Telugu News