YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సినీ నటుడు కృష్ణుడు!

  • ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో జగన్ పాదయాత్ర
  • కత్తిపూడిలో జగన్ ను కలిసిన కృష్ణుడు
  • పార్టీ కండువాను కప్పి ఆహ్వానించిన జగన్

కొన్ని చిత్రాల్లో హీరోగా, మరికొన్ని చిత్రాల్లో కమేడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు కృష్ణుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం వైఎస్ జగన్ పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతుండగా, కత్తిపూడిలో జగన్ ను కలిసిన కృష్ణుడు, ఆయన చేతుల మీదుగా పార్టీ కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణుడు మాట్లాడుతూ, జగన్ పాదయాత్ర తనకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చిందని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా విజయం సాధించడానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. పాదయాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తున్న జగన్ ను అభినందించినట్టు కృష్ణుడు తెలిపారు.

YSRCP
Jagan
East Godavari District
Kattipudi
Krishnudu
  • Loading...

More Telugu News