Manoj Bajpayee: ఆ సినిమాలు చేస్తుంటే ఉద్యోగానికి వెళ్లి వస్తున్నట్టు ఉంటోంది: మనోజ్ బాజ్‌పేయి

  • కమర్షియల్ సినిమాలు చేయడం ఇష్టం ఉండదు
  • సంబంధాలు కొనసాగించడానికి చేయక తప్పడం లేదు
  • మనసులో మాట బయటపెట్టిన బాలీవుడ్ నటుడు

వైవిధ్య భరిత పాత్రలు పోషిస్తూ చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి. కమర్షియల్ సినిమాల్లో నటించడంపై అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. అటువంటి సినిమాలు చేయడం తనకు ఇష్టం ఉండదని తేల్చి చెప్పాడు. అయినప్పటికీ చేయక తప్పడం లేదని, అవి చేస్తుంటే రోజూ ఉద్యోగానికి వెళ్లి వస్తున్నట్టు ఉందని చెప్పుకొచ్చాడు. ఉదయం 9 గంటలకు వెళ్లి సాయంత్రం ఐదింటికి ఇంటికి రావడంగానే దానిని భావిస్తానని పేర్కొన్నాడు.

ఇండిపెండెంట్ సినిమాలు లాభాలు ఆర్జించి పెడతాయన్న మనోజ్.. దేశంలో అదో ప్యాషన్ అయి కూర్చుందన్నాడు. మంచి సినిమాలు చేయాలన్నదే తన అభిమతమని, ఎప్పటికీ అదే దారిలో నడుస్తానని స్పష్టం చేశాడు. ఇండిపెండెంట్ సినిమాలంటే తనకిష్టమైనప్పటికీ మనోజ్, ‘వీర్ జారా’, ‘బేవపా’, ‘షూట్ అవుట్’ ‘వదలా’, ‘తేవార్’ వంటి బాలీవుడ్ సంప్రదాయ సినిమాల్లో కూడా నటించాడు. చిత్రపరిశ్రమలో సంబంధాలు నిలుపుకోవడానికే కమర్షియల్ చిత్రాలు చేస్తున్నట్టు బాజ్‌పేయి స్పష్టం చేశాడు.

Manoj Bajpayee
Bollywood
Actor
independent films
  • Loading...

More Telugu News