Ox: ఏటీఎంలో దూరిన వృషభం హాయిగా విశ్రమించిన వేళ..!

  • అనంతపురం జిల్లా పామిడిలో ఘటన
  • డబ్బు డ్రా చేసేందుకు వచ్చి ఎద్దును చూసి భయపడ్డ ప్రజలు
  • ఏటీఎంలను నిర్లక్ష్యంగా నిర్వహిస్తున్నారని విమర్శలు

ఎక్కడెక్కడ తిరిగి అలసిపోయిందోగానీ, ఆ వృషభం విశ్రమించేందుకు ఓ ఏటీఎంను ఎంచుకుంది. ఈ ఘటన అనంతపురం జిల్లా పామిడిలో కనిపించింది. ఓ ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డు లేకపోవడం, తలుపు తీసుండటంతో ఆ ఎద్దు హాయిగా లోనికి వచ్చి పడకేసింది. ఆ సమయంలో డబ్బులు తీసుకునేందుకు వచ్చిన కొందరు లోపలున్న ఎద్దును చూసి భయపడి మరో ఏటీఎంను వెతుక్కుంటూ వెళ్లారు. కొందరు ఎద్దు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఏటీఎంలను ఇంత నిర్లక్ష్యంగా ఎలా నిర్వహిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

Ox
ATM
Anantapur District
  • Loading...

More Telugu News