sonali bendre: పూర్తిగా గుండు చేయించుకున్న సోనాలి బింద్రే.. ఫొటో షేర్ చేసిన నటి

- హైగ్రేడ్ క్యాన్సర్ తో బాధ పడుతున్న సోనాలి
- కీమో థెరపీ కోసం గుండు చేయించుకున్న నటి
- తోడుగా ఉన్న సుసానే ఖాన్, గాయత్రి ఒబెరాయ్
బాలీవుడ్ నటి సోనాలి బింద్రే హైగ్రేడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె అమెరికాలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమెకు కీమో థెరపీ చికిత్సను అందిస్తున్నారు. క్యాన్సర్ విషయం బయటపడినప్పటి నుంచి ప్రతి క్షణం ఆనందంగా ఉండేందుకు ఆమె యత్నిస్తున్నారు. హాస్పిటల్ లో చేరిన తర్వాత జుట్టును కొంచెం కత్తిరించుకున్న ఆమె... తాజాగా పూర్తిగా గుండు చేయించుకున్నారు. ఈ ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలో ఆమెతో పాటు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ మాజీ భార్య సుహానే ఖాన్, బాలీవుడ్ నటి గాయత్రి ఒబెరాయ్ లు ఉన్నారు. ప్రస్తుతం సోనాలికి తోడుగా వీరిద్దరూ ఆసుపత్రిలో ఉన్నారు.
