motkupalli: జగన్ వ్యాఖ్యలను చంద్రబాబు వక్రీకరిస్తున్నారు: మోత్కుపల్లి

  • అప్పుడు మాదిగలను, ఇప్పుడు కాపులను మోసం చేశారు
  • మాదిగలకు తీరని అన్యాయం చేసింది చంద్రబాబే
  • ఇరు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ అంతరించి పోతుంది

గతంలో మాదిగలను మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు కాపులను కూడా మోసం చేస్తున్నారంటూ టీటీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు విమర్శలు గుప్పించారు. ఎస్సీ రిజర్వేషన్లను అటకెక్కించి, మాదిగలకు తీరని అన్యాయం చేసింది చంద్రబాబే అని మండిపడ్డారు. మాదిగల ఏబీసీడీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నానని చెప్పిన చంద్రబాబు... దానికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేయించలేదని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ చేయడం చేతకాని చంద్రబాబు కాపులకు ఒరగబెట్టేదేముందని ఎద్దేవా చేశారు.

కాపు రిజర్వేషన్లపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను తప్పుదోవ పట్టిస్తున్నారని మోత్కుపల్లి దుయ్యబట్టారు. చంద్రబాబు ఏ పని చేసినా కేవలం ఓట్లు, సీట్లకోసమేనని విమర్శించారు. రానున్న రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ అంతరించిపోతుందని జోస్యం చెప్పారు 

motkupalli
Chandrababu
sc reservations
kapu reservations
jagan
  • Loading...

More Telugu News