nidhi subbaiah: మైసూర్ ప్యాలెస్ లో కన్నడ నటి ఫొటో షూట్.. మండిపడుతున్న జనాలు

  • మైసూరు ప్యాలెస్ దర్బార్ హాల్ లో ఫొటో షూట్
  • ప్యాలెస్ పరిసరాల్లో ఫొటో షూట్ పై అమల్లో ఉన్న నిషేధం
  • వివాదాస్పదమైన నిధి సుబ్బయ్య ఫొటో షూట్

ప్రముఖ కన్నడ హీరోయిన్ నిధి సుబ్బయ్య భారీ ఎత్తున విమర్శలను ఎదుర్కొంటోంది. మైసూరు ప్యాలెస్ లోని దర్బార్ హాల్ లో ఆమె ఫొటో షూట్ చేయడమే దీనికి కారణం. ప్యాలెస్ పరిసర ప్రాంతాల్లో ఫొటో షూట్ చేయడంపై కొంత కాలం క్రితం అధికారులు నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో, నిషేధిత ప్రదేశంలో ఫొటో షూట్ చేయడంపై జనాలు మండిపడుతున్నారు. ఈ షూట్ కు సంబంధించిన ఫొటోను నిధి సుబ్బయ్య తన సోషల్ మీడియా పేజ్ లో అప్ లోడ్ చేయడంతో... నెటిజన్లు ఆమెపై నిప్పులు చెరుగుతున్నారు.

నిధి ఫొటో షూట్ కు అధికారులు ఎలా అనుమతించారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై నిధి స్పందిస్తూ, ప్యాలెస్ లో తాను ఫొటో షూట్ చేయలేదని, కేవలం ఒక టూరిస్ట్ మాదిరి అక్కడకు వెళ్లిన తాను, అందరు టూరిస్టుల మాదిరే ఫొటో తీసుకున్నానని వివరణ ఇచ్చింది. మరోవైపు ప్యాలెస్ భద్రతాధికారి ఏసీపీ శైలేంద్ర మాట్లాడుతూ, ప్యాలెస్ లో ఫొటోలు తీయడంపై నిషేధం లేదని, నవరాత్రుల సమయంలో, అంబారి ఉన్నప్పుడు మాత్రమే నిషేధం అమల్లో ఉంటుందని చెప్పారు. 

nidhi subbaiah
sandalwood
actress
photo shoot
mysoor
  • Loading...

More Telugu News