Yadadri Bhuvanagiri District: నెల రోజుల వేతనం ఒక్క రోజులో వస్తుంది: యాదాద్రి వ్యభిచారిణి మాటలతో అధికారుల అవాక్కు!

  • వ్యభిచార వృత్తిని మానుకోవాలని అధికారుల వినతి
  • అంగన్ వాడీ పోస్టులను రిజర్వ్ చేసిన అధికారులు
  • తమకు అక్కర్లేదంటున్న వ్యభిచారిణులు

"మీరు చెప్పిన చోట నెల రోజుల పాటు పనిచేస్తే వచ్చే వేతనం కన్నా నేను ఒక్క రోజులో ఎక్కువగా సంపాదిస్తాను"... ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా? యాదగిరిగుట్టలో వ్యభిచారం చేస్తున్న ఓ మహిళ. యాదాద్రి పరిసర ప్రాంతాల్లో వ్యభిచార వృత్తి మానుకోవాలని, అలా భావించే వారి కోసం కొన్ని అంగన్ వాడీ పోస్టులను రిజర్వ్ చేశామని, పిల్లలకు చదువు చెబుతూ, వారి ఆలనా, పాలనా చూసుకుంటూ, ఈ పాపపు కూపం నుంచి బయటకు రావాలని చెబుతున్న అధికారులను ఈ తరహా సమాధానాలు అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా వ్యభిచార వృత్తిలో ఉంటున్న వీళ్లు, సాధారణ జీవనంలోకి రావాలని భావించడం లేదని అధికారులే అంటున్నారు.

అంగన్ వాడీ పోస్టులను రిజర్వ్ చేసినా, వాటిలో చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా వేళ్లూనుకున్న వ్యభిచార నిర్మూలన అంత సులువుగా సాధ్యం కాదని, అరెస్ట్ చేసి, కోర్టుకు తీసుకెళితే, వారు తిరిగి వచ్చి అదే పనిలో నిమగ్నమవుతారని, వ్యభిచారిణులు, వారికి సహకరిస్తున్న మధ్యవర్తులపై బెయిలబుల్ సెక్షన్లు ఉండటమే ఇందుకు కారణమని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ప్రస్తుతం పట్టుబడిన వారిపై మాత్రం కఠిన చర్యలు ఉంటాయని, వారిపై పీడీ చట్టాన్ని ప్రయోగించనున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.

  • Loading...

More Telugu News