Mahatma Gandhi: గాంధీ, నెహ్రూ చిత్రాలతో పేపర్ ప్లేట్లు.. ఉపయోగించాక నలిపి పడేసిన నాయకులు!

  • రాజమహేంద్రవరం నగర పాలక మండలి సమావేశంలో ఘటన
  • పేపర్ ప్లేట్లపై జాతినేతల చిత్రాలు
  • అందులోనే అల్పాహారం అందించడంపై విమర్శలు

రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పాలకమండలి సమావేశంలో నాయకులు, అధికారులు ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. శనివారం పాలకమండలి సమావేశం నిర్వహించగా అధికారులు, నేతలకు పేపర్ ప్లేట్లలో అల్పాహారం అందించారు. అక్కడి వరకు బాగానే ఉంది. అయితే, అలా అందించిన ప్లేట్లలో జాతి నేతలైన మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, అబ్దుల్ కలాం తదితరుల చిత్రాలు ఉన్నాయి. వాటిలోనే నేతలకు అల్పాహారం అందించారు. తిన్నాక నాయకులు, అధికారులు వాటిని నలిపి చెత్తబుట్టలో పడేశారు.

వీటిని చూసిన కొందరు నొచ్చుకున్నారు. పేపర్ ప్లేట్లపై మహాత్ముల చిత్రాలు ముద్రించడమే తప్పైతే, వాటిలో అల్పాహారం తీసుకున్న నేతలు వాటిని నలిపి పడేయడం మరో పెద్ద తప్పయింది. చెత్తబుట్టలో మహనీయుల ఫొటోలు చూసిన వారు నొచ్చుకుని వాటిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై అధికారులు, నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలపై అధికారులు, సమావేశంలో పాల్గొన్న నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Mahatma Gandhi
Jawaharlal Nehru
Rajamahendravaram
Paper plates
Andhra Pradesh
  • Loading...

More Telugu News