motkupalli: పవన్, జగన్ లకు నేను సాయం చేస్తా: మోత్కుపల్లి

  • చంద్రబాబు ఇంటి ముందు 15 ఏళ్ల పాటు కుక్కలా ఉన్నా
  • బాబుకు చుక్కలు చూపించాలన్నదే కోరిక
  • చంద్రబాబు ఫలితాన్ని అనుభవించాలి

చంద్రబాబు ఇంటిముందు 15 ఏళ్లు కుక్కలా ఉన్నానని... తాను లేకపోతే ఆయన తిండి తినలేదని, నీళ్లు తాగలేదని, నిద్రపోలేదని... తనను బాగా వాడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభ సీటు ఇస్తానన్నారని, గవర్నర్ పదవిని ఇప్పిస్తానని చెప్పారని... చివరకు పార్టీలో ఒక సభ్యుడిలా కూడా కొనసాగకుండా వెలివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

గత మూడు నెలలుగా తాను రాజకీయాల గురించి మాట్లాడటం లేదని మోత్కుపల్లి చెప్పారు. కేవలం తన లక్ష్యం ఏమిటో మాత్రమే చెబుతున్నానని... ఒక దళితుడినైన తనను అమర్యాదకరంగా పార్టీ నుంచి గెంటి వేశారని... దానికి సంబంధించిన ఫలితాన్ని చంద్రబాబు అనుభవించాలని చెబుతున్నానని అన్నారు. మాల, మాదిగలంటే చిన్న చూపు ఉండే చంద్రబాబుకు చుక్కలు చూపించాలన్నదే తన అభిమతమని చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఒక మిత్రుడిగా సాయం చేయాలనుకుంటున్నానని తెలిపారు. జగన్ కు కూడా ఒక మిత్రుడిగా తనకు తోచిన సాయం చేస్తానని చెప్పారు. తాను తిరుపతికి వెళ్లినప్పుడు జగన్, పవన్ ల మనుషులు తన కోసం వచ్చారని తెలిపారు.

motkupalli
Chandrababu
jagan
Pawan Kalyan
  • Loading...

More Telugu News