bin laden: నా కుమారుడు మంచోడు.. ఛాందసవాదులు మార్చేశారు: బిన్ లాడెన్ తల్లి

  • 20 ఏళ్ల వయసులో లాడెన్ కు ఛాందసవాదులు పరిచయం అయ్యారు
  • వాళ్లే లాడెన్ కు బ్రెయిన్ వాష్ చేశారు
  • నేనంటే నా కుమారుడికి చాలా ప్రేమ

ఆల్ ఖైదా మాజీ చీఫ్, అమెరికా 9/11 ఉగ్రదాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ తల్లి అలియా ఘనేమ్ తొలిసారి ఇంటర్వ్యూ ఇచ్చారు. సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో అత్యంత విలాసవంతమైన బంగళాలో నివాసం ఉంటున్న ఆమెను... ఆ దేశ ప్రభుత్వ అనుమతితో ఓ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన కుమారుడు లాడెన్ చాలా మంచి వాడని తెలిపారు. ప్రస్తుతం ఆమె వయసు 70 ఏళ్లు.

20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు లాడెన్ కు కొందరు మత ఛాందసవాదులు పరిచయమయ్యారని... తన కుమారుడికి వారు బ్రెయిన్ వాష్ చేశారని అలియా చెప్పారు. వాళ్లకు దూరంగా ఉండాలని తాను చాలా సార్లు చెప్పానని తెలిపారు. తనపై లాడెన్ కు చాలా ప్రేమ ఉందని... అందుకే అతను ఏమి చేస్తున్నాడో ఎప్పుడూ తనకు చెప్పేవాడు కాదని అన్నారు. జెడ్డాలోని అబ్దులజీజ్ యూనివర్శిటీలో అతను రాడికలైజ్ అయ్యాడని చెప్పారు.

bin laden
mother
interview
  • Loading...

More Telugu News