america: ఇండియాను మరింత దగ్గర చేసుకున్న అమెరికా.. భారత్ కు ఎస్టీయే-1 హోదా!

  • ఎస్టీయే-1 హోదా అందుకున్న మూడో ఆసియా దేశంగా భారత్
  • రక్షణ రంగంలో మరింత బలోపేతం కానున్న ఇండియా
  • అణు ఇంధన సరఫరాదారుల కూటమిలో సభ్యత్వం లేకున్నా.. మినహాయింపునిచ్చిన అమెరికా

చైనాకు అమెరికా మరో షాక్ ఇచ్చింది. రక్షణ రంగంలో భారత్ మరింత బలోపేతం అయ్యేందుకు సహకారాన్ని అందించింది. ఇండియాకు వ్యూహాత్మక వాణిజ్య హోదా (ఎస్టీయే-1)ను ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ఫెడరల్ నోటీసును జారీ చేసింది. ఈ హోదాను అందుకున్న ఆసియా దేశాల్లో భారత్ మూడోది కాగా... దక్షిణాసియాలో ఏకైక దేశం కావడం గమనార్హం. ఆసియాలో భారత్ కంటే ముందు జపాన్, దక్షిణ కొరియాలు (ఆసియా దేశాలు) మాత్రమే ఈ హోదాను పొందాయి. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా ఎస్టీయే-1 హోదా పొందిన 37వ దేశంగా భారత్ అవతరించింది.

ఈ హోదాను పొందడం వల్ల ఆధునిక సాంకేతికతతో కూడిన రక్షణ ఉత్పత్తుల విక్రయాలపై అమెరికా మిత్ర దేశాలు ఎలాంటి రాయితీలు పోందుతాయో... భారత్ కూడా ఆ రాయితీలు పొందనుంది. వాస్తవానికి అణు ఇంధన సరఫరాదారుల కూటమి, ఆస్ట్రేలియా కూటమి, వాసెనార్ ఒప్పందం, క్షిపణి పరిజ్ఞాన నియంత్రణ వ్యవస్థల్లో సభ్యత్వం ఉన్న దేశాలకు మాత్రమే అమెరికా ఎస్టీయే-1 హాదాను ఇస్తోంది. అయితే వీటిలో అణు ఇంధన సరఫరాదారుల కూటమిలో ఇండియాకు సభ్యత్వం లేదు. అయినప్పటికీ భారత్ కు మినహాయింపును ఇస్తూ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది.

అమెరికా ఫెడరల్ నోటిఫికేషన్ తో చైనాకు షాక్ తగిలినట్టైంది. ఎందుకంటే, అణు ఇంధన సరఫరాదారుల కూటమిలో భారత్ సభ్యత్వానికి చైనా అడ్డు చెబుతూ వస్తోంది. చైనా వల్ల భారత్ కు సభ్యత్వం రావడం లేదు. దీంతోపాటు భారత్-అమెరికాల రక్షణ ఒప్పందాలు, సాంకేతికత బదలాయింపులపై చైనా వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో, చైనాకు అమెరికా మరో షాక్ ఇచ్చింది.

  • Loading...

More Telugu News