helicopter: పక్కనున్న విమానం తగలడంతో కుప్పకూలిన హెలికాప్టర్.. 18 మంది దుర్మరణం!

  • రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఘటన
  • వాంకోవర్ సంస్థ సిబ్బందిని తీసుకుని టేకాఫ్ అయిన హెలికాప్టర్
  • మరు క్షణమే కుప్పకూలిన వైనం 

టేకాఫ్ అయిన కాసేపటికే హెలికాప్టర్ కూలిన ఘటనలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన రష్యాలోని సైబీరియా ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, ఎంఐ-8 అనే హెలికాప్టర్ 'వాంకోవర్' సంస్థకు చెందిన సిబ్బందిని తీసుకుని టేకాఫ్ అయింది. అయితే పక్కనే ఉన్న మరో విమానంలోని పరికరాలు తగలడంతో కుప్పకూలి, పేలిపోయింది. మరణించిన వారిలో 15 మంది ప్రయాణికులు కాగా, ముగ్గురు హెలికాప్టర్ సిబ్బంది ఉన్నారు. మరోవైపు, తమ సంస్థలో పనిచేస్తున్న 15 మంది మరణించిన వార్తను తెలుసుకున్న వాంకోవర్ సంస్థ సిబ్బంది విషాదంలో మునిగిపోయారు. 

helicopter
crash
Russia
  • Loading...

More Telugu News