gulab singh: పాకిస్థాన్ తొలి సిక్కు పోలీసుకు షాక్.. సెలవులో ఉన్నాడని ఉద్యోగం నుంచి తొలగించిన వైనం!

  • విచారణ అనంతరం విధుల నుంచి తొలగించిన పోలీస్ శాఖ
  • ఈటీపీబీ ఒత్తిడితోనే తనను తొలగించారన్న గులాబ్ సింగ్
  • డీఐజీకి అప్పీలు చేసుకునే అవకాశం

పాకిస్థాన్ తొలి సిక్కు పోలీసు అధికారికి ప్రభుత్వం షాకిచ్చింది. మూడు నెలలుగా విధులకు హాజరుకావడం లేదన్న కారణంతో ఉద్యోగం నుంచి తొలగించింది.  గులాబ్ సింగ్ మూడు నెలలుగా విధులకు హాజరు కానందుకు అతడిని విధుల నుంచి డిస్మిస్ చేసినట్టు ట్రాఫిక్ పోలీసు అధికార ప్రతినిధి అలీ నవాజ్ తెలిపారు. గులాబ్ సింగ్‌పై ఎస్పీ (ట్రాఫిక్) అసీఫ్ సాదిక్ విచారణ నిర్వహించిన అనంతరం అతడిని డిస్మిస్ చేసినట్టు తెలిపారు. అయితే, తన డిస్మిస్‌ను సవాలు చేస్తూ అతడు డీఐజీ (ట్రాఫిక్)‌కి అప్పీలు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

సిక్కు గురుద్వారా ప్రబంధక్ కమిటీ (పీఎస్‌జీపీసీ)కి చెందిన ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు (ఈటీపీబీ) తనను, తన కుటుంబ సభ్యులను లాహోర్ సమీప గ్రామంలోని తమ ఇంటి నుంచి వెళ్లగొట్టిందని గులాబ్ సింగ్ గత నెలలో ఆరోపించాడు. అంతేకాదు, తన ఇంటి నుంచి బలవంతంగా వెళ్లగొట్టినందుకు బోర్డు అధికారులపై కేసు కూడా పెట్టాడు.

ఆ కేసును వెనక్కి తీసుకోవాలని ట్రాఫిక్ పోలీస్ ఎస్పీ ద్వారా ఇటీవల ఒత్తిడి చేశారని సింగ్ ఆరోపించాడు. అందుకు నిరాకరించడంతోనే తనను తొలగించారని పేర్కొన్నాడు. తాను ప్రమాదం బారిన పడ్డానని, అందుకనే సెలవు తీసుకున్నానని పేర్కొన్నాడు. అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టును సెలవు దరఖాస్తుతో కలిపి అందజేసినట్టు తెలిపాడు.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News