Durgada: తిరుగాడిన చోటనే దుర్గాడ పాముకు అంత్యక్రియలు... గుడి పనులు ప్రారంభం
- పల్లకీలో ఊరేగించిన దుర్గాడ గ్రామస్తులు
- గుడి కట్టేందుకు పొలం యజమాని అంగీకారం
- గురువారం నాడు మరణించిన పాము
26 రోజుల పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడలో పూజలందుకున్న పాముకు అంత్యక్రియలు ఘనంగా జరిపించారు గ్రామస్తులు. గురువారం మధ్యాహ్నం పాము మరణించిన తరువాత శోకసంద్రంలో మునిగిపోయిన ప్రజలు, ఆ రాత్రంతా శివాలయంలో పామును ఉంచి భజనలు, ప్రత్యేక పూజలు చేశారు. ఆపై నిన్న ఓ పల్లకీలో పాము కళేబరాన్ని ఉంచి, గ్రామ వీధుల్లో ఊరేగించారు. తాను తిరుగాడిన చోటనే ఖననం చేశారు. అక్కడ గుడి కట్టించేందుకు పొలం యజమాని అంగీకరించడంతో ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించారు. శ్రావణ మాసంలోగా గుడి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు.