PV Sindhu: సైనా విఫలమైన వేళ... డిఫెండింగ్ చాంపియన్ పై గర్జించిన సింధు!

  • ఒకుహరాపై ఘన విజయం
  • 21-17, 21-19 తేడాతో విజయం
  • కరోలినా మారిన్ చేతిలో ఓడిపోయిన సైనా నెహ్వాల్

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ క్వార్టర్ ఫైనల్ లో డిఫెండింగ్ చాంపియన్ ఒకుహరాపై ఘన విజయం సాధించిన తెలుగుతేజం పీవీ సింధు, సెమీస్ లోకి ప్రవేశించి పతకాన్ని ఖాయం చేసుకుంది. ఫైనల్ లో స్థానం కోసం ఆమె నేడు వరల్డ్ నంబర్ టూ అకానె యమగూచీతో తలపడనుంది.

క్వార్టర్ ఫైనల్ లో మూడో సీడ్ గా బరిలోకి దిగిన సింధు.. ఒకుహరాపై 21-17, 21-19 తేడాతో విజయం సాధించింది. ఇదే సమయంలో మరో భారత స్టార్ సైనా నెహ్వాల్, ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత కరోలినా మారిన్ చేతిలో ఓడిపోయింది. పదో సీడ్ గా బరిలోకి దిగిన సైనా పెద్దగా పోటీ ఇవ్వకుండానే 21-6, 21-11తో ఘోరంగా ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ లో తలపడిన సాయి ప్ర్రణీత్ సైతం ఓడిపోయాడు.

PV Sindhu
Saina Nehwal
World Badminton
Okuhara
Karolina Marin
  • Loading...

More Telugu News