Karimnagar District: భార్యాభర్తల మధ్య గొడవ.. భార్యను తుపాకితో కాల్చిన భర్త.. కరీంనగర్‌లో కలకలం!

  • భార్యతో గొడవపడి సహనం కోల్పోయిన భర్త
  • కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన భార్య
  • పరిస్థితి విషమం.. పోలీసుల అదుపులో నిందితుడు

భార్యాభర్తల మధ్య ప్రారంభమైన చిన్నపాటి గొడవ ఏకంగా కాల్పులకు దారి తీసింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణాపూర్‌ కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఏదో విషయంలో కనకయ్య, ఆయన భార్య మధ్య గొడవ మొదలైంది. అది క్రమంగా ముదిరి పెద్దదైంది. దీంతో ఆగ్రహం పట్టలేని కనకయ్య వెంటనే తన దగ్గరున్న తుపాకి తీసి భార్యపై కాల్పులు జరిపాడు.

తీవ్ర గాయాలపాలైన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.  స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కనకయ్యను అదుపులోకి తీసుకున్నారు. కనకయ్య వద్ద ఉన్న తుపాకిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

Karimnagar District
Gun
Telangana
  • Loading...

More Telugu News