Vijayawada: విజయవాడలో ఘోరం... ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి దూకిన శ్రీచైతన్య విద్యార్థిని దేవిశ్రీ

  • అనుకున్న స్థాయిలో రాని మార్కులు
  • మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం
  • తీవ్ర గాయాలతో ఆసుపత్రికి

విజయవాడలో ఘోరం జరిగింది. శ్రీ చైతన్య కళాశాలలో చదువుకుంటున్న కుందన దేవిశ్రీ అనే విద్యార్థిని బెంజ్ సర్కిల్ దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి కిందకు దూకింది. చదువు విషయంలో ఒత్తిడి పెరగడం, అనుకున్న స్థాయిలో మార్కులను తెచ్చుకోవడంలో విఫలమవడంతో మనస్తాపంతోనే దేవిశ్రీ ఈ ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది.

 ఈ ఘటనలో ఆమె తలకు తీవ్రగాయాలు కాగా, స్థానికులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. పటమటలో ఉన్న చైతన్య కాలేజీ భాస్కర్ భవన్ క్యాంపస్ లో ఉంటున్న విద్యార్థినిగా గుర్తించి, ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

Vijayawada
Sri Chaitanya
Sucide Atempt
  • Loading...

More Telugu News