Andhra Pradesh: కంపెనీల ఏర్పాటుకు భూముల కేటాయింపులో నిర్లక్ష్యం వద్దు: ఏపీ సీఎస్

- ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు
- ఎంవోయూల్లో ఒప్పందం మేరకు ఉద్యోగాలు ఇవ్వాలి
- సమీక్ష సమావేశంలో సీఎస్
కంపెనీల ఏర్పాటుకు ముందుకొచ్చిన పెట్టుబడుదారులకు భూముల కేటాయింపుల్లో నిర్లక్ష్యం చూపొద్దని జిల్లాల కలెక్టర్లను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో భారీ, మధ్యతరహా పరిశ్రమలకు మౌలిక వసతుల కల్పనపై ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు.
ముందుగా శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు జిల్లాల్లో ఏర్పాటు కాబోతున్న పరిశ్రమలకు భూ కేటాయింపులపై ఆయా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మూడు జిల్లాల్లో ఏర్పాటు చేయబోతున్న కంపెనీలకు తక్షణమే భూ కేటాయింపులకు చర్యలు తీసుకోవాలని దినేష్ కుమార్ ఆదేశించారు. అనంతరం, పలు కంపెనీలకు మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ పవర్ పాయింట్ ప్రజంటేష్ ద్వారా వివరించారు.
