Andhra Pradesh: నాలుగున్నరేళ్ల తరువాత నిరుద్యోగ భృతా? ఎన్నికల కోసమేగా?: ఏపీ యువత మిశ్రమ స్పందన!

  • చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ప్రకటిస్తే బాగుండేది
  • ఇప్పుడు ఎన్నికల స్టంటన్న అభిప్రాయం ఏర్పడుతోంది
  • ఏదేమైనా భృతి ఇవ్వడం స్వాగతించదగ్గ పరిణామం
  • ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తే ఖజానాపై భారం తగ్గుతుంది

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ భృతిపై యువతీ యువకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ప్రభుత్వం ఏర్పాటైన నాలుగున్నరేళ్లకు ఈ పథకానికి విధివిధానాలు ప్రకటించడం ఏంటని యువత ప్రశ్నిస్తోంది. పలువురు ఇంతకాలానికైనా ఓ ప్రధాన హామీని నెరవేర్చే దిశగా చంద్రబాబు సర్కారు అడుగులు వేసిందని అంటుంటే, ఇది ఎన్నికల స్టంటని కొందరు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పుడే భృతిని ప్రారంభించి వుంటే బాగుండేదని, మరో ఏడెనిమిది నెలల్లో ఎన్నికలు రానుండగా, ఇప్పుడు ఇవ్వడంతో ఎన్నికల కోసమే నిరుద్యోగ భృతి ఇస్తున్నారన్న అభిప్రాయం నెలకొందని అంటున్నారు.

ఇదే సమయంలో నెలకు ఎంతో కొంతయినా డబ్బు చేతిలో పడితే, నిరుద్యోగులు ఉత్సాహంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటారని, ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలనూ భర్తీ చేస్తే, భృతి కింద చెల్లించే నిధుల మొత్తం తగ్గి, ఖజానాపై భారం తగ్గుతుందని కూడా సలహాలు ఇస్తున్నారు. ఈ పథకంలో రాజకీయ నేతల జోక్యం లేకుండా చేయాలని, ఆర్థికంగా వెనుకబడిన కులాలకు చెందిన వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కొందరు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News