Arun Jaitly: ఈ నెలలోనే తిరిగి విధుల్లోకి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ!

  • మేలో మూత్రపిండ మార్పిడి చేయించుకున్న జైట్లీ
  • మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యులు
  • పూర్తి కావడంతో తిరిగి విధుల్లోకి

మూడు నెలలపాటు మంత్రి బాధ్యతలకు దూరంగా ఉన్న అరుణ్ జైట్లీ నార్త్ బ్లాక్‌లోని తన కార్యాలయానికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అనారోగ్య కారణాలతో జైట్లీ మూడు నెలలుగా మంత్రిత్వ బాధ్యతలకు దూరంగా ఉన్నారు. ఆయన పరోక్షంలో రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఆర్థిక శాఖకు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. మే నెలలో మూత్ర పిండ మార్పిడి చేయించుకున్న జైట్లీ వైద్యుల సలహా మేరకు మూడు నెలలు విశ్రాంతి తీసుకున్నారు.

మూడు నెలల విశ్రాంతి పూర్తికావడంతో ఈ నెలాఖరులో బాధ్యతలు చేపట్టేందుకు జైట్లీ సిద్ధమవుతున్నట్టు ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. కాగా, జైట్లీ గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతున్నారు.

Arun Jaitly
Finance minister
Narendra Modi
  • Loading...

More Telugu News