kamal: ఉత్కంఠను రేపుతోన్న 'విశ్వరూపం 2' ట్రైలర్

  • కమల్ కథానాయకుడిగా 'విశ్వరూపం 2'
  • తీవ్రవాదంపై పోరాటమే నేపథ్యం 
  • ఆగస్టు 10వ తేదీన భారీ రిలీజ్

కమలహాసన్ కథానాయకుడిగానే కాదు .. దర్శకనిర్మాతగాను 'విశ్వరూపం 2' సినిమా చేశారు. భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమాను ఆగస్టు 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రపంచశాంతికి ప్రమాదంగా మారిన తీవ్రవాదం .. దానిని ఎదుర్కునే దేశభక్తి నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది.

తాజాగా విడుదల చేసిన ట్రైలర్ లోను అవే దృశ్యాలను చూపించారు. సినిమాలోని యాక్షన్ సీన్స్ హాలీవుడ్ రేంజ్ లో వున్నాయనే టాక్ ఇప్పటికే బయటికి వచ్చేసింది. 'విశ్వరూపం' కథను ఎక్కడైతే ఆపేశారో .. అక్కడి నుంచే 'విశ్వరూపం 2' మొదలవుతుందని కమల్ చెప్పారు. మొదటి భాగాన్ని అప్పట్లో వివాదాలు చుట్టుముట్టిన కారణంగా, రెండవభాగంలో అలాంటివేం లేకుండా చూసుకున్నామని ఆయన అన్నారు.

kamal
pooja kumar
  • Error fetching data: Network response was not ok

More Telugu News