Wine Shops: హైదరాబాద్ లో వచ్చే ఆది, సోమవారాలు మందు బంద్... మూతపడనున్న బార్లు, పబ్బులు!

  • ఆదివారం నాడు పలు ఆలయాల్లో బోనాలు
  • ముందు జాగ్రత్త చర్యగా మద్యం దుకాణాలు బంద్
  • స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బులకు మినహాయింపు

నగర వ్యాప్తంగా పలు అమ్మవారి దేవాలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరుగకుండా ముందు జాగ్రత్తగా 5, 6 తేదీలు... అంటే ఆదివారం, సోమవారాల్లో మద్యం దుకాణాలను మూసి వేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

బార్లు, పబ్బులను కూడా మూసివేయాలని, స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బులకు మాత్రం మినహాయింపు ఉంటుందని అన్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకూ ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్‌ భగవత్‌ వెల్లడించారు. పోలీసుల ఆదేశాలు అతిక్రమించి మద్యం విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News