singapore: సింగపూర్ తరహా పాలన అని మాత్రం ఆయన అనరు!: చంద్రబాబుపై పవన్ విసుర్లు

  • సింగపూర్ లో చట్టం ఎవరికైనా ఒకేలా అమలవుతుంది
  • మహిళా అధికారిపై ఓ ఎమ్మెల్యే దాడి చేస్తే వదిలేశారు
  • అదే సింగపూర్ లో అయితే ఆ ఎమ్మెల్యే జైలులో ఉండేవాడు  

ఏపీ సీఎం చంద్రబాబుపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ విమర్శలు ఎక్కుపెట్టారు. హైదరాబాద్ లోని ‘జనసేన’ కార్యాలయంలో ఆ పార్టీకి సంబంధించిన వీర మహిళ విభాగం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎప్పుడూ ‘సింగపూర్ సిటీలాంటిది నిర్మిస్తా.. సింగపూర్ తరహా నిర్మాణాలు’ అని అంటారు. అంతే తప్ప, సింగపూర్ తరహా పాలన అని మాత్రం ఆయన చెప్పరు.

ఎందుకంటే, అక్కడ చట్టం ఎవరికైనా ఒకే రీతిలో కఠినంగా అమలవుతుంది. మహిళలకి భద్రత ఇస్తుంది. విధి నిర్వహణలో ఉన్న మహిళా అధికారిపై ఓ ఎమ్మెల్యే దాడి చేస్తే కనీసం పట్టించుకోలేదు. వదిలేశారు. అదే సింగపూర్ తరహా పాలన అయితే ఆ ఎమ్మెల్యే జైల్లో ఉంటాడు. మహిళలపై దాడులు చేస్తే చూసీచూడనట్లు వదిలేస్తే అలాంటి ఘటనలు పెరుగుతూ వస్తాయి’ అని పవన్ అన్నారు.

singapore
Pawan Kalyan
  • Loading...

More Telugu News