imran khan: ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లడం లేదు!: ఆమిర్ ఖాన్

  • ఇమ్రాన్ నుంచి నాకు ఆహ్వానం అందలేదు
  • పానీ ఫౌండేషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా
  • ఆగస్టు 12న జరిగే ప్రజా కార్యక్రమానికి హాజరవుతున్నా

పాకిస్థాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ చేసే ప్రమాణస్వీకారానికి తాను వెళ్లడం లేదని బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ తెలిపారు. తాను పాకిస్థాన్ వెళ్తున్నట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఇమ్రాన్ ఖాన్ నుంచి తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని చెప్పారు. క్రికెటర్లు గవాస్కర్, కపిల్ దేవ్, సిద్ధూలతో పాటు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కు కూడా ఆహ్వానం అందిందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ వార్తలపై స్పందిస్తూ ఆమిర్ స్పష్టమైన ప్రకటన చేశారు. పానీ ఫౌండేషన్ కార్యక్రమాల్లో తాను బిజీగా ఉన్నానని... ఆగస్టు 12న జరిగే ప్రజా కార్యక్రమానికి హాజరవుతున్నానని... ఈ కార్యక్రమంలో సుమారు 10 వేల మంది గ్రామస్తులు పాల్గొంటారని చెప్పారు. మరోవైపు, ఇమ్రాన్ ప్రమాణస్వీకారానికి తాను వెళ్తున్నానని సిధ్దూ ఇప్పటికే ప్రకటించారు.

imran khan
oath
Aamir Khan
  • Loading...

More Telugu News