syeraa: చిరంజీవి పట్టించుకోవడం లేదు.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశీకుల కంటతడి!

  • మా వీరుడి చరిత్రను తెరకెక్కిస్తుండటం మాకు సంతోషమే
  • మమ్మల్ని నామమాత్రంగా కూడా పట్టించుకోవడం లేదు
  • చిరంజీవి మాట్లాడతారు అని చెబుతున్నారు.. కానీ, ఇంతవరకు మాట్లాడలేదు

బ్రిటీష్ వారికి ముచ్చెమటలు పట్టించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో 'సైరా' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నరసింహారెడ్డిగా చిరంజీవి నటిస్తుండగా, రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అడపాదడపా చిన్నచిన్న ఆటంకాలు ఎదురవుతున్నా... తాజాగా ఉయ్యాలవాడ వంశీకుల నుంచి నిరసన ఎదురవుతోంది.

తమ వంశానికి చెందిన వీరుడి చరిత్రను తెరకెక్కిస్తుడటం తమకు ఎంతో సంతోషం కలిగించే విషయమైనప్పటికీ, తమను నామమాత్రంగా కూడా గుర్తించడం లేదని ఉయ్యాలవాడ వంశీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ చరిత్రను సినిమాగా తీస్తున్నందుకు తమకు బాధ లేదని... తమను ఏ మాత్రం పట్టించుకోవడం లేదనేదే తమ ఆవేదన అని కంటతడి పెట్టారు.

కర్నూలు నుంచి హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నామని... చిరంజీవి కానీ, రామ్ చరణ్ కానీ తమను పట్టించుకోవడం లేదని చెప్పారు. చిరంజీవిగారు వచ్చి మాట్లాడతారని చెబుతూనే ఉన్నారని... ఇంతవరకు ఆయన తమతో మాట్లాడలేదని అన్నారు. తమను పక్కన పెట్టి, వారి పని మాత్రం వారు చేసుకుంటూ పోతున్నారని వాపోయారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఉయ్యాలవాడ వంశీకులు మాట్లాడుతూ, ఈ మేరకు ఆవేదన వ్యక్తం చేశారు. 

syeraa
Chiranjeevi
Ramcharan
narasimha reddy
family members
  • Loading...

More Telugu News