Pakistan: పాకిస్థాన్ కు వెళుతున్నా: సిద్ధూ

  • 11న ఇమ్రాన్ ఖాన్ ప్రమాణం
  • తనకు ఆహ్వానం అందిందన్న సిద్ధూ
  • తప్పకుండా వెళతానని వెల్లడి

ఈనెల 11వ తేదీన పాకిస్థాన్ నూతన ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ, తాను వెళ్లనున్నట్టు మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తెలియజేశారు. ఇమ్రాన్ నుంచి తనకు ఆహ్వానం అందిందన్న విషయాన్ని వెల్లడించిన ఆయన, ఇది తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఇమ్రాన్ పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి తాను తప్పకుండా వెళతానని చెప్పారు. ఖాన్ మంచి వ్యక్తని, నమ్మదగిన వాడని కొనియాడారు. రెండు దేశాల మధ్య క్రీడాకారులు వారధిలా నిలుస్తారని అభిప్రాయపడ్డ ఆయన, ఇమ్రాన్ రాకతో భారత్- పాక్ ప్రజల మధ్య ఐక్యత పెరుగుతుందని భావిస్తున్నట్టు చెప్పారు.

Pakistan
Imran Khan
Taking Oath
  • Loading...

More Telugu News