Warangal Urban District: వరంగల్ ఆర్టీసీ డిపోలో ఐదు బస్సులు దగ్ధం!

  • షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం
  • ఓ ఇంద్ర, రెండు సూపర్ లగ్జరీ బస్సులు దహనం
  • ప్రమాదంపై విచారణకు ఆదేశం

వరంగల్ లోని ఆర్టీసీ బస్సు డిపోలో గురువారం రాత్రి తీవ్ర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బ్రేక్ డౌన్ అయిన ఓ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగగా, అవి నిమిషాల్లోనే పక్కనున్న మరో ఐదు బస్సులకు అంటుకున్నాయి. ఓ ఇంద్ర, రెండు సూపర్ లగ్జరీ బస్సులు కాలిపోయాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో వచ్చి మంటలను అదుపు చేశారు. జరిగిన ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. అగ్నిప్రమాదంపై ఉన్నతాధికారులతో విచారణ జరిపిస్తామని, ఉద్యోగుల నిర్లక్ష్యం ఉందని తేలితే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

Warangal Urban District
TSRTC
Fire Accident
  • Loading...

More Telugu News