mamata banerji: టీడీపీ ఎంపీలను ప్రశంసించిన మమతా బెనర్జీ

  • అవిశ్వాస తీర్మానం పెట్టి మంచి పని చేశారన్న సీఎం 
  • గల్లా, రామ్మోహన్ నాయుడి ప్రసంగాలపై ప్రశంస
  • కేశినేని నానిని ప్రత్యేకంగా అభినందించిన మమత

లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై ఇటీవల జరిగిన చర్చలో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని ప్రసంగించిన తీరుపై పలువురు ప్రశంసించారు. తాజాగా, ఈ ముగ్గురు ఎంపీలపై పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ప్రశంసలు కురిపించారు.

పార్లమెంట్ సెంట్రల్ హాల్ దగ్గర టీడీపీ ఎంపీలను మమతాబెనర్జీ ఈరోజు కలిశారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టి మంచి పనిచేశారన్న మమత, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు ప్రసంగాలు అద్భుతంగా ఉన్నాయని చెబుతూ వారిని ప్రశంసించారు. అలాగే కేశినేని నానిని మమత ప్రత్యేకంగా అభినందించినట్టు టీడీపీ వర్గాల సమాచారం.

mamata banerji
Telugudesam mp`s
  • Loading...

More Telugu News