Hyderabad: విడాకుల కోసం భార్య తనను అవమానించిందన్న ఉక్రోషంతో.. అశ్లీల వీడియోను పంపిన భర్త!

  • భార్య కుటుంబీకులకు పోర్న్ వీడియో పంపిన ప్రబుద్ధుడు
  • అరెస్ట్ చేసిన పోలీసులు
  • కోర్టు ఆదేశాలతో రిమాండ్ కు తరలింపు

భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. ఒకవేళ ఇద్దరి మధ్య మనస్పర్థలు తీర్చలేని స్థాయిలో వచ్చేస్తే విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ సమయంలో కొందరు హుందాగా విడిపోయి గౌరవాన్ని నిలబెట్టుకుంటే, మరి కొందరేమో బజారుకెక్కి ఉన్న పరువును పోగొట్టుకుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో ఉంటున్న విబవసుకు  2016లో అనూషతో వివాహమైంది. కేవలం 15 రోజుల పాటు కలిసి ఉన్న ఈ జంట ఆ తర్వాత విడిపోయింది. భార్యాభర్తలను కలిపేందుకు ఇరుకుటుంబాల పెద్దలు చేసిన ప్రయత్నాలూ ఫలించలేదు. కొన్ని రోజులకు అనూష ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు దాఖలు చేసింది. తన భర్త సంసారానికి పనికిరాడనీ, కాబట్టి వెంటనే విడాకులు మంజూరు చేయాలని కోరింది.

ఈ విషయం తెలుసుకున్న విబవసు ఆగ్రహంతో ఊగిపోయాడు. తాను నపుంసకుడిని కాదని నిరూపించడానికి జుగుప్సాకరమైన పనిచేశాడు. తాను మరో మహిళతో కలసి వున్న అశ్లీల వీడియోను అనూష తండ్రి, పిన్నికి పంపాడు. దీంతో వాళ్లు చెన్నైలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో విబవసును అరెస్ట్ చేసిన పోలీసులు.. కోర్టు ఆదేశాలతో రిమాండ్ కు తరలించారు.

Hyderabad
lb nagar
impotant husband
divorce
porn video
Police
  • Loading...

More Telugu News