ntr: ఎన్టీఆర్ బయోపిక్ కు 85 కోట్ల భారీ ఆఫర్?

  • ఎన్టీఆర్ బయోపిక్ పై భారీ అంచనాలు
  • రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ భారీ ఆఫర్ 
  • పోటీలో మరో ప్రముఖ సంస్థ సోనీ

మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో టైటిల్ పాత్రను బాలకృష్ణ పోషిస్తుండగా... ఇతర పాత్రల్లో విద్యాబాలన్, కీర్తి సురేష్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. తొలి షెడ్యూల్ ను ఇప్పటికే పూర్తి చేసుకున్న ఈ చిత్రం... రెండో షెడ్యూల్ కు సిద్ధమవుతోంది.

ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో... బిజినెస్ పరంగా కూడా భారీ క్రేజ్ నెలకొంది. తెలుగు, హిందీ, తమిళం సహా అన్ని భాషల హక్కులకు సంబంధించి రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ ఏకంగా రూ. 85 కోట్లను ఆఫర్ చేసిందని విశ్వసనీయ సమాచారం. అయితే హక్కు ల కోసం మరో ప్రముఖ సంస్థ సోనీ కూడా పోటీ పడుతోంది. అయితే, రూ. 100 కోట్ల కోసం నిర్మాతలు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ntr
biopic
business
rights
balakrishna
reliance entertainments
sony
  • Loading...

More Telugu News