jonathan: ఇది లిపి వున్న కంటి భాష.. అద్భుతం సృష్టించిన చిచ్చరపిడుగు!

- సెరెబ్రల్ పాల్సీ తో బాధపడుతున్న జోనాథన్
- ట్రైన్ ఫ్రేమ్ బోర్డుతో పుస్తక రచన
- సాయం చేసిన తల్లి చెంటన్
పిల్లలకు చిన్న జ్వరం వస్తేనే తల్లిదండ్రులు అల్లాడిపోతారు. చివరికి వాళ్లు తిరిగి ఆడుకునేవరకూ కన్నవాళ్ల ప్రాణం కుదుటపడదు. మరి కన్నకొడుకు జీవితాంతం కాళ్లు, చేతులు కదలించలేడనీ, మాట్లాడలేడని తెలిస్తే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? మిగతావారి సంగతేమో కానీ ఇంగ్లండ్ కు చెందిన చెంటన్ బ్రయాన్ అలా అనుకోలేదు. సెరెబ్రల్ పాల్సీ(కండరాలు చచ్చుపడిపోయే వ్యాధి)తో బాధ పడుతున్న తన కుమారుడు ఏదైనా సాధించగలడని నమ్మింది. తల్లి నమ్మకాన్ని నిలబెట్టుకున్న ఆ పిల్లాడు ఏకంగా ఓ పుస్తకం రాసి చరిత్ర సృష్టించాడు.

పూర్తయిన పుస్తకాన్ని గుండెలపై పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న జోనాథన్ ఫొటో ప్రస్తుతం ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. కాగా, ఆత్మవిశ్వాసం కారణంగానే జోనాథన్ ఈ అద్భుతాన్ని సాధించగలిగాడని అతని తల్లి చెంటన్ చెబుతోంది.