jagan: కాపులను తండ్రీకొడుకులు ఇద్దరూ మోసం చేశారు: మంత్రి నారాయణ

  • కాపు రిజర్వేషన్లు సాధ్యమేనని 2016లో జగన్ చెప్పారు
  • ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు
  • రాజశేఖర్ రెడ్డి, జగన్ ఇద్దరూ కాపులను మోసం చేశారు

కాపు రిజర్వేషన్లపై వైసీపీ అధినేత జగన్ మాట మార్చారని ఏపీ మంత్రి నారాయణ విమర్శించారు. కాపు రిజర్వేషన్లు సాధ్యమేనని 2016లో జగన్ అన్నారని... ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. రోజుకో మాట, పూటకో అబద్ధం చెప్పేవారు నాయకులు కాలేరని అన్నారు. కాపులు పేదరికాన్ని అనుభవిస్తున్నారని... వారు ఎదగాలంటే రిజర్వేషన్లు అవసరమని చెప్పారు. కాపులను తండ్రీకొడుకులు రాజశేఖర్ రెడ్డి, జగన్ ఇద్దరూ మోసం చేశారని దుయ్యబట్టారు. కాపు రిజర్వేషన్లకు టీడీపీ కట్టుబడి ఉందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని అన్నారు.

jagan
rajasekhar reddy
narayana
kapu
reservations
  • Loading...

More Telugu News