shankar: వాళ్లు లేకపోతే నేను ఈ మైలురాయిని దాటేవాడిని కాదు: దర్శకుడు శంకర్
- భారీ చిత్రాల దర్శకుడిగా శంకర్
- దర్శకుడిగా 25 వసంతాలు పూర్తి
- సన్నిహితులు నిర్వహించిన సన్మాన కార్యక్రమం
భారీ చిత్రాల దర్శకుడిగా శంకర్ కి ఎంతో క్రేజ్ వుంది. ఆయన సిద్ధం చేసుకునే కథాకథనాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. తమిళ చిత్ర పరిశ్రమలో తిరుగులేని కథానాయకులుగా వెలుగొందుతోన్న రజనీకాంత్ .. కమల్ వంటి వారికే, వాళ్ల కెరియర్లో చెప్పుకోదగిన సినిమా చేసిపెట్టిన ఘనత శంకర్ సొంతం. ఇక అర్జున్ .. విక్రమ్ వంటి వారి కెరియర్లోను శంకర్ సినిమాలు ప్రత్యేకంగా నిలుస్తాయి.అలాంటి శంకర్ దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ ప్రయాణంలో ఆయన టీమ్ లో సహాయకులుగా చేసిన వాళ్లు ఎంతోమంది ఈ రోజున స్టార్ డైరెక్టర్లుగా దూసుకుపోతున్నారు. వాళ్లలో అట్లీ కుమార్ .. బాలాజీ శక్తివేల్ .. వసంత కుమార్ ముఖ్యులుగా కనిపిస్తారు. శంకర్ 25 వసంతాలు పూర్తి చేసుకున్నందుకు గాను ఆయన సన్నిహితులంతా కలిసి, చెన్నైలోని ఒక హోటల్లో సన్మాన కార్యక్రమాన్ని జరిపారు. ఈ సందర్భంలోనే .. "వీళ్లంతా నా సహాయకులు .. వీళ్ల సహాయం లేకపోతే నేను ఈ మైలురాయిని దాటి ఉండేవాడిని కాదు' అంటూ వాళ్లతో దిగిన ఒక ఫోటోను శంకర్ పోస్ట్ చేశాడు.