Canada: కెనడా వదిలి వెళ్లిపో.. లేదంటే నీ పిల్లల్ని చంపేస్తా: భారత సంతతి జంటకు వేధింపులు

  • ఒంటారియోలో విద్వేష ఘటన
  • ఇంటర్నెట్ లో వీడియో వైరల్
  • నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు

ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా విదేశీయులు, వలస వచ్చిన వారిపై విద్వేష నేరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా కెనడాలో భారత సంతతి జంటకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఓ షాపింగ్ మాల్ సమీపంలో వీరితో గొడవపడ్డ శ్వేత జాతీయుడు.. భారత్ కు తిరిగి వెళ్లిపోకుంటే మీ పిల్లల్ని చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఈ ఘటనపై విద్వేష నేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఒంటారియో నగరంలో వాల్ మార్ట్ షాపు ముందు భారత సంతతి కెనడియన్ జంటతో రాబర్ట్ సన్(47) అనే వ్యక్తి పార్కింగ్ విషయమై గొడవకు దిగాడు. దీంతో ఆగ్రహానికి లోనైన భారత సంతతి వ్యక్తి ‘నేను కెనడియన్ ను..నేను ఇండియాకు వెళ్లిపోవాలని అంటున్నావా?’ అని ఆగ్రహంగా ప్రశ్నించాడు. దీంతో ‘నేను నిన్ను నమ్మను, నీ మాట తీరు కెనడియన్ లా లేదు. మీరిద్దరూ నాకు నచ్చలేదు. మీ దేశానికి వెళ్లిపోండి, లేదంటే మీ పిల్లల్ని చంపేస్తా’ అని అతను కారులో అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.

ఈ ఘటనను ఫోన్ లో రికార్డ్ చేసిన ఆ దంపతులు వీడియోను తమ స్నేహితులకు పంపించారు. వారు దీన్ని యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. దీన్ని గమనించిన పోలీసులు విద్వేష నేరం, ర్యాష్ డ్రైవింగ్ తదితర అభియోగాల కింద రాబర్ట్ సన్ ను అరెస్ట్ చేశారు.

Canada
racist
indian origin couple
kill kids
ontario
  • Error fetching data: Network response was not ok

More Telugu News