sushanth: ఫస్టాఫ్ చూడగానే ఏడ్చేశాను: 'చి ల సౌ' గురించి సమంత

- చిన్మయి నా స్నేహితురాలు
- రాహుల్ నాకు చాలాకాలంగా తెలుసు
- ఆయనలో మంచి దర్శకుడు వున్నాడు
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'చి ల సౌ' సినిమా రూపొందింది. సుశాంత్ .. రుహాని శర్మ జంటగా నటించిన ఈ సినిమా, ఈ నెల 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. పెళ్లి చూపుల్లో కలుసుకున్న ఒక అమ్మాయి .. అబ్బాయి ఓ మర్డర్ కారణంగా ఒక రాత్రంతా ఒకచోట వుండి పోవలసి వస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందనేదే కథాంశం. రాహుల్ రవీంద్ర భార్య చిన్మయి .. సమంతకు డబ్బింగ్ చెబుతూ వుంటుందనే విషయం తెలిసిందే. ఇక రాహుల్ కూడా సమంతకు చాలా కాలంగా తెలుసు.
