bihar: 'మంత్రగాడు ఉండగా.. డాక్టరెందుకు?' అంటూ ముగ్గురి ప్రాణాలు తీసిన గ్రామస్తులు!

  • బిహార్ లోని భోజ్ పురి జిల్లాలో దారుణం
  • పాము కాటుతో మంత్రగాడి వద్దకు
  • విషం శరీరమంతా వ్యాపించడంతో ముగ్గురి మృతి

ఆధునిక వైద్యం, చికిత్సలు ఎంత అందుబాటులోకి వచ్చినా ఇంకా చాలామంది ప్రజలు మూఢనమ్మకాలతో కాలం వెళ్లదీస్తున్నారు. తాజాగా మూఢ నమ్మకం కారణంగా బిహార్ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

బిహార్ లోని భోజ్ పూరి జిల్లా ఆగమా గ్రామానికి చెందిన రాజేశ్(56), ఆయన కుమార్తె అంశు కుమారి, కుమారుడు విష్ణులు ఒకే మంచం మీద నిద్రిస్తుండగా ఓ విషపూరితమైన పాము కాటు వేసింది. దీంతో ముగ్గురు సాయం కోసం గట్టిగా అర్థించారు.

వీరి అరుపులతో అక్కడకు చేరుకున్న గ్రామస్తులు వీరిని ఆస్పత్రికి తరలించడం మాని స్థానికంగా ఉండే మంత్రగాడి వద్దకు తీసుకెళ్లారు. అతను మంత్రం ద్వారా విషం తొలగిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చాడు. చివరికి పాము విషం శరీరమంతా వ్యాపించడంతో ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. 

bihar
snake bite
3 dead
rajesh
family
whitch craft
  • Loading...

More Telugu News