Oneplus: యాపిల్, శాంసంగ్‌కు ఝలక్కిచ్చిన వన్‌ప్లస్

  • భారత్‌లోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై పట్టు సాధించిన వన్‌ప్లస్
  • ప్రీమియం సెగ్మెంట్‌లో అగ్రస్థానం
  • మూడో స్థానానికి పడిపోయిన యాపిల్

మొబైల్ మార్కెట్లో దిగ్గజాలుగా ఉన్న అమెరికన్ కంపెనీ యాపిల్, దక్షిణ కొరియా మేకర్ శాంసంగ్‌కు చైనా కంపెనీ వన్‌ప్లస్ షాకిచ్చింది. భారత్‌లోని ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో ఆ రెండింటిని తోసిరాజని అగ్రస్థానాన్ని అలంకరించింది. ఏప్రిల్-జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ప్రీమియం సెగ్మెంట్ (రూ.30 వేలకుపైగా)లో ఏకంగా 40 శాతం మార్కెట్ షేర్‌ను సొంతం చేసుకుంది. 35 శాతంతో శాంసంగ్ రెండో స్థానంతో సరిపెట్టుకోగా, యాపిల్ 14 శాతం మార్కెట్ షేర్‌తో మూడో స్థానంతో సరిపెట్టుకుంది.  

భారత్‌తో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు విపరీతమైన గిరాకీ ఉన్నట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. భారత మార్కెట్‌‌ను కచ్చితంగా అంచనా వేస్తున్న చైనీస్ బ్రాండ్ మిగతా వాటికంటే గట్టి పట్టు సాధించినట్టు పేర్కొంది. దీంతో యాపిల్, శాంసంగ్‌పై ఒత్తిడి పెరిగినట్టు తెలిపింది. రూ.30 వేలకు పైగా ధర ఉన్న స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ ప్రస్తుతం భారత్‌లోని మొత్తం మార్కెట్‌షేర్‌లో 3 శాతం షేర్‌ను సొంతం చేసుకున్నట్టు సంస్థ తెలిపింది.

  • Loading...

More Telugu News