jagan: జగన్ బహిరంగ సభకు వెళుతున్న వారి వాహనానికి ప్రమాదం.. ఇద్దరి మృతి.. పలువురికి గాయాలు!

  • తూ.గో.లోని ధర్మవరం వద్ద సంఘటన
  • అదుపు తప్పి బోల్తా పడ్డ మినీలారీ
  • ఇద్దరు మృతి.. పద్దెనిమిది మందికి గాయాలు 

తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో వైసీపీ అధినేత జగన్ బహిరంగ సభకు వెళ్తున్న వారి వాహనం బోల్తా పడింది. ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరం వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మినీలారీ వేగంగా వెళ్తున్న సమయంలో సైకిల్ పై వెళ్తున్న వ్యక్తి అడ్డుగా రావడంతో అదుపు తప్పిన వాహనం బోల్తా పడింది. సంఘటనా స్థలంలో ఒకరు మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు విడిచారు. పద్దెనిమిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రత్తిపాడు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో పది మందికి తీవ్ర గాయాలు కాగా, వీరిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. 

jagan
East Godavari District
dharma varam
  • Loading...

More Telugu News