Chiranjeevi: 'ఈనాడు' రామోజీరావుకు గ్రీన్ ఛాలెంజ్ విసిరిన చిరంజీవి!

  • ఎన్టీవీ చౌదరి విసిరిన ఛాలెంజ్ ను పూర్తి చేసిన చిరంజీవి
  • రామోజీ, అమితాబ్, పవన్ లకు చిరు ఛాలెంజ్
  • ఇప్పటికే ఈ ఛాలెంజ్ లో పాల్గొన్న పలువురు ప్రముఖులు

ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను చిరంజీవి స్వీకరించిన సంగతి తెలిసిందే. తన ఇంటి ప్రాంగణంలో ఆయనే స్వయంగా మట్టిని తవ్వి, మూడు మొక్కలను నాటి, నీరు పోశారు. అనంతరం ఆయన మరో ముగ్గురు ప్రముఖులకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లను ఆయన ఈ ఛాలెంజ్ కు నామినేట్ చేశారు. మరోవైపు, ఈ గ్రీన్ ఛాలెంజ్ కు భారీ ఎత్తున స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సచిన్ టెండూల్కర్, కేటీఆర్, మహేష్ బాబు, రాజమౌళి లాంటి ప్రముఖులు ఈ ఛాలెంజ్ ను పూర్తి చేసి... పలువురిని నామినేట్ చేశారు.

Chiranjeevi
ramojirao
Amitabh Bachchan
Pawan Kalyan
  • Loading...

More Telugu News