jagan: చర్చకు రాకపోతే జగన్ తోక ముడిచినట్టు భావిస్తా: పిఠాపురం ఎమ్మెల్యే వర్మ

  • సాగునీటి ప్రాజెక్టులపై సాక్షి తప్పుడు కథనాలను ప్రచురించింది
  • బహిరంగ చర్చకు జగన్ రావాలి
  • విజయసాయిరెడ్డిని పంపినా ఓకే

వైసీపీ అధినేత జగన్, సాక్షి దినపత్రికలపై పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీ ఎస్సెన్ వర్మ మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులపై సాక్షి పత్రిక తప్పుడు కథనాలను ప్రచురించిందని ఆయన ఆరోపించారు. ఈ కథనాలకు వ్యతిరేకంగా గొల్లప్రోలులో ఆయన ధర్నాకు దిగారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలంటూ జగన్ కు సవాల్ విసిరారు. రేపు ఉదయం 10 గంటలకు కాకినాడలోని అంబేద్కర్ భవన్ లో చర్చకు సిద్ధమని అన్నారు. చర్చకు జగన్ వచ్చినా సరే, లేదా విజయసాయిరెడ్డిని పంపినా ఓకే అని చెప్పారు. ఒకవేళ చర్చకు జగన్ రాకపోతే... ఆయన తోక ముడిచినట్టుగా భావిస్తానని అన్నారు.

jagan
vijayasai reddy
Telugudesam
mla
varma
  • Loading...

More Telugu News