kotipalli raghava: వాకింగ్ లో రాఘవగారు కలుస్తుండేవారు: లక్ష్మీపార్వతి

  • ఈ ఉదయం తుదిశ్వాస విడిచిన రాఘవ
  • నివాళి అర్పించిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు
  • రాఘవగారి జీవితం ఆదర్శవంతం అన్న లక్ష్మీపార్వతి

ప్రముఖ సినీ నిర్మాత కోటిపల్లి రాఘవ ఈ ఉదయం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుని, భౌతికకాయానికి నివాళి అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి, నటుడు సుమన్ లు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

రాఘవగారి జీవితం అందరికీ ఆదర్శవంతమని లక్ష్మీపార్వతి ఈ సందర్భంగా చెప్పారు. ఆయనకున్న మంచి అలవాట్లే ఆయనను 105 ఏళ్లు బతికించాయని చెప్పారు. ఉదయం వాకింగ్ సమయంలో రాఘవగారు కలుస్తుండేవారని... తన అనుభవాలను తమతో పంచుకునేవారని తెలిపారు. సుమన్ మాట్లాడుతూ... రాఘవగారు, భరద్వాజగారి లాంటివారి సహకారం వల్లే తన జీవితం మలుపు తిరిగిందని చెప్పారు. రాఘవగారు తనను కన్నకొడుకులా చూసుకున్నారని చెప్పారు. ఆయన తనతో నిర్మించిన 'తరంగిణి' చిత్రం వెయ్యి రోజులు ఆడిందని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాదుకు రావడం వెనుక ఆయన కృషి ఎంతో ఉందని చెప్పారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. 

kotipalli raghava
lakshmi parvathi
suman
  • Loading...

More Telugu News