jaleel khan: చందనా బ్రదర్స్ తో ఒప్పందాన్ని రద్దు చేస్తున్నాం: వక్ఫ్ బోర్డు ఛైర్మన్ జలీల్ ఖాన్
- డబ్బు తీసుకున్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా
- వేలంపాటలో ఎక్కువ కోట్ చేసిన వారికే లీజుకిచ్చాం
- జామా మసీదు ఆస్తులకు మళ్లీ వేలంపాటను నిర్వహిస్తాం
వక్ఫ్ బోర్డుకు ప్రభుత్వం నుంచి నిధులు రావని, తామే సమకూర్చుకోవాలని వక్ఫ్ బోర్డు ఛైర్మన్ జలీల్ ఖాన్ అన్నారు. బోర్డు ఆస్తులను పెంచుకునేందుకే జామా మసీదు ఆస్తులను లీజుకు ఇచ్చామని చెప్పారు. తాను ఎవరి దగ్గర డబ్బు తీసుకోలేదని, డబ్బు తీసుకున్నట్టు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. వేలంపాటలో అధికంగా కోట్ చేసిన వారికే లీజుకిచ్చామని చెప్పారు. చందనా బ్రదర్స్ తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తున్నామని, బహిరంగ వేలాన్ని మళ్లీ నిర్వహిస్తామని తెలిపారు. ఓ సంస్థకు కారు చవకగా జామా మసీదు ఆస్తులను కట్టబెట్టారని ఆరోపిస్తూ జనసేన, సీపీఐలు విజయవాడలో ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.