priyanka chopra: 'భారత్' నుంచి ప్రియాంక చోప్రా వెళ్లిపోవడానికి నిక్ జొనాస్ ఒకడే కారణం కాదట!

  • రూ. 12 కోట్లు ఇస్తామని చెప్పి.. రూ. 6.5 కోట్ల చెక్ ఇచ్చారు
  • దిశా పటానీ, నోరా ఫతేహిలను తీసుకోవడం కూడా ప్రియాంకకు నచ్చలేదు
  • కొత్త కారణాలను వెల్లడించిన డీఎన్ఏ

సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'భారత్' నుంచి ప్రియాంకచోప్రా తప్పుకున్న సంగతి తెలిసిందే. అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ తో పెళ్లి నేపథ్యంలోనే ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకుందని కథనాలు వచ్చాయి. జూలై 18న ప్రియాంక పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరూ లండన్ లో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారని సమాచారం. అయితే, ఈ చిత్రం నుంచి ప్రియాంక తప్పుకోవడానికి నిక్ జొనాస్ తో పెళ్లి ఒకటే కారణం కాదని... ఇతర కారణాలు కూడా ఉన్నాయని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

రెమ్యునరేషన్, క్యాస్టింగ్ కారణాలు కూడా ఉన్నాయని డీఎన్ఏ పత్రిక తెలిపింది. ఆ కథనం ప్రకారం... 'భారత్' చిత్రానికి గాను ప్రియాంకకు నిర్మాతలు రూ. 12 కోట్లు ఆఫర్ చేశారు. వాస్తవానికి ప్రియాంక డిమాండ్ చేసింది రూ. 14 కోట్లు. కానీ ఆమెకు రూ. 6.5 కోట్ల చెక్ మాత్రమే ఇచ్చారట. ఈ విషయంపై ఖాన్ కుటుంబానికి చెందిన ఒక క్లోజ్ ఫ్రెండ్ తో ఆమె చర్చించింది. కానీ, ఆమెకు డబుల్ డిజిట్ ఫిగర్ ను చెల్లించాల్సినంత అవసరం లేదని నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.

దీనికి తోడు, సినిమాకు తీసుకున్న ఇతర నటీమణుల విషయంలో కూడా ప్రియాంక డిజప్పాయింట్ అయిందట. ప్రియాంక పేరును ప్రకటించిన తర్వాత దిశా పటానీని కూడా సినిమాలోకి తీసుకున్నారు. ఆ తర్వాత నోరా ఫతేహిని కూడా ఛాన్స్ ఇచ్చారు. వీరిద్దరినీ సినిమాలోకి తీసుకోవడం కూడా ప్రియాంకకు నచ్చలేదట. ఈ కారణాల వల్లే 'భారత్' కు ప్రియాంక దూరమైందని డీఎన్ఏ తెలిపింది. 

priyanka chopra
bharat movie
remuneration
disha patani
nora fatehi
nick jonas
marriage
  • Loading...

More Telugu News