Prakasam District: చార్జింగ్ పెట్టిన ఫోన్ పేలి... ప్రకాశం జిల్లాలో యువకుడి మృతి!

  • కనిగిరి మండలం వాగుపల్లిలో ఘటన
  • చార్జింగ్ పెట్టి దానిని ఒంటిపై పెట్టుకుని నిద్రించిన మస్తాన్ రెడ్డి
  • అధిక కరెంటు ప్రవహించి పేలిన ఫోన్

చార్జింగ్ లో ఉన్న ఫోన్ పేలి యువకుడు మరణించిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, కనిగిరి మండలం వాగుపల్లి గ్రామంలో మస్తాన్ రెడ్డి, గత రాత్రి ఫోన్ కు చార్జింగ్ పెట్టి నిద్రించాడు. ఆ సమయంలో అధిక విద్యుత్ మొబైల్ లోకి ప్రవేశించడంతో ఆ ఫోన్ భారీ శబ్దం చేస్తూ పేలింది. పేలుడు ధాటికి పక్కనే నిద్రిస్తున్న మస్తాన్ రెడ్డి అక్కడికక్కడే మరణించాడు.

ఆ సమయంలో ఫోన్ అతని శరీరంపైనే ఉన్నట్టు తెలుస్తుండగా, మస్తాన్ మృతికి విద్యుదాఘాతం కూడా కారణమైంది. మొబైల్ పేలగానే, అతని శరీరానికి షాక్ తగిలినట్టు తెలుస్తోంది. ఎడాప్టర్ కి షార్ట్ సర్క్యూట్ కావడంతో 230 ఓల్టుల కరెంట్ మొబైల్ లోకి ప్రవేశించి, అది పేలినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నాణ్యతలేని ఫోన్లు, చార్జర్లను వాడటమే ఈ తరహా ప్రమాదాలకు కారణమవుతున్నాయని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్టు చెప్పారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News