Vijay Mallya: ఇక ఫైనల్ వాదనలు... బ్రిటన్‌ కోర్టు ముందుకు నేడు మాల్యా!

  • నేడు మాల్యా అప్పగింతపై తుది విచారణ
  • తీర్పు తేదీని కూడా ప్రకటించనున్న జడ్జి
  • ఏడాది నుంచి బెయిల్ పై ఉన్న మాల్యా

తనను భారత్‌ కు అప్పగించే విషయమై దాఖలైన పిటిషన్‌ పై తుది వాదన వినిపించేందుకు లండన్‌ లోని వెస్ట్‌ మినిస్టర్‌ కోర్టుకు నేడు విజయ మాల్యా హాజరుకానున్నారు. వాదనల అనంతరం ఈ పిటిషన్ పై తీర్పు ఎప్పుడు వెలువడుతుందన్న విషయాన్ని కూడా న్యాయమూర్తి ఎమ్మా అర్బుత్నోట్‌ నేడు ప్రకటించనున్నారు.

ఇండియాలో ప్రముఖ బ్యాంకుల నుంచి రూ. 9 వేల కోట్లను అప్పుగా తీసుకుని ఎగ్గొట్టిన మాల్యాను తమ దేశానికి అప్పగించాలని భారత్ కోరుతున్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం ఏప్రిల్ లో మాల్యాను బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేయగా, అప్పటి నుంచి ఆయన బెయిల్ పై ఉన్నారు. నేటి తుది వాదనల తరువాత, తీర్పు కోసం ఓ తేదీని జడ్జి నిర్ణయిస్తారని క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీసెస్ కు చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు.

Vijay Mallya
Bail
London
India
Britain
  • Loading...

More Telugu News