Andhra Pradesh: ఫుల్ జోష్‌లో అమరావతి.. రేపు పది ఐటీ కంపెనీలు ప్రారంభం

  • అమరావతి ప్రాంతంలో ఐటీ కంపెనీలు ప్రారంభం
  • వందకు చేరిన సంస్థలు
  • ఐదు వేలకు పెరిగిన ఉద్యోగుల సంఖ్య

ఏపీ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా బుధవారం రాజధాని అమరావతి ప్రాంతంలో మరో పది ఐటీ కంపెనీలు ప్రారంభం కానున్నాయి. విజయవాడలోని ఎంకే ప్రీమియం, మేథాటవర్స్, మంగళగిరిలోని ఎన్‌ఆర్‌టీ టెక్‌ పార్కుల్లో ఉన్న వీటిని మంత్రి ప్రారంభించనున్నారు. ఏపీఎన్ఆర్‌టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 60 కంపెనీల్లో ప్రస్తుతం 3500 మందికిపైగా ఉద్యోగులున్నారు. వచ్చే ఆరు నెలల్లో వీటిలో మరో వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్టు ఏపీఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు వేమూరు రవి తెలిపారు.

రేపు ప్రారంభం కానున్న కంపెనీలతో కలుపుకుంటే విజయవాడ, గుంటూరు సహా రాజధాని ప్రాంతంలో ఉన్న ఐటీ కంపెనీల సంఖ్య వంద దాటింది. ఇక, హెచ్‌సీఎల్ వంటి సంస్థలు కూడా త్వరలోనే రాజధానిలో తమ శాఖలను ఏర్పాటు చేయనున్నాయి. ఇందుకోసం కార్యాలయాలను సిద్ధం చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఐటీ సంస్థల్లో మొత్తం 5 వేల మందికిపైగా పనిచేస్తున్నారు.

Andhra Pradesh
Amaravathi
Minister
Nara Lokesh
  • Loading...

More Telugu News